నేడు జిల్లాకు ఎల్లో అలర్ట్

నేడు జిల్లాకు ఎల్లో అలర్ట్

NLG: రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు నల్గొండతో సహా 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. అయితే మూడు రోజుల తర్వాత ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు.