అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: మేయర్

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: మేయర్

కడప నగరంలోని 21వ డివిజన్‌లో పర్యటించిన మేయర్ సురేశ్ కుమార్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రైతు బజార్ ఎంట్రెన్స్ వద్ద ఆక్రమణలను వెంటనే తొలగించి, మార్కింగ్ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ద్వారకా నగర్లో పందుల బెడద, డ్రైనేజీ సమస్యలపై తక్షణమే స్పందించి నోటీసులు జారీ చేయాలని హెల్త్ ఆఫీసర్కు సూచించారు.