దొంగతనం కేసులో నిందుతుడి అరెస్ట్

PLD: దొంగతనం కేసులో నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు సొత్తును రికవరీ చేసినట్లు రెంటచింతల ఎస్సై నాగార్జున బుధవారం తెలిపారు. గత నెల 2వ తేదీన రెంటచింతలలోని గనిపల్లి జనార్ధనరావు ఇంట్లో దొంగతనం జరిగినట్లు కుటంబ సభ్యులు పేర్కొన్నారు. బంగారు వెండి ఆభరణాలతో పాటు రూ.20వేల నగదు చోరీకి గురైందని ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి తమ్మిశెట్టి సాయిను బుధవారం అరెస్ట్ చేశారు.