ఏసీబీ రైడ్స్.. వెలుగులోకి సంచలన విషయాలు
AP: రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB దాడులు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్యుమెంట్ రైటర్స్‌తో కుమ్మక్కైన సబ్ రిజిస్ట్రార్లు నెలవారీ మామూళ్లకు తెరలేపారు. ఒంగోలులోని ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నుంచి రూ.30 వేల నోట్ల కట్టని బయటకు విసిరేశారు. కాగా, గతంలో ACBకి చిక్కిన అధికారులపై బృందం స్పెషల్ ఫోకస్ పెట్టింది.