VIDEO: శ్రీశైలంలో హుండీ లెక్కింపు.. రూ.3.61కోట్ల ఆదాయం

NDL: శ్రీశైలంలో హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 28 రోజులకు గానూ రూ.3,61,42,016ల ఆదాయం వచ్చినట్లు ఆలయ EO శ్రీనివాసరావు తెలిపారు. అలాగే 105 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి, 644 USA డాలర్లు, 50 సౌదీ అరేబియా రియాల్స్, కువైట్, కెనడా, దక్షిణాఫ్రికా కరెన్సీని కూడా భక్తులు సమర్పించారని చెప్పారు. ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది అందరు పాల్గొన్నారు.