VIDEO: 'భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

NZB: ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. NZB నగరంలో బోధన్ రోడ్ స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్‌లు పరిశీలించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.