రోడ్డు భద్రతపై యువతకు పోలీసుల దిశానిర్దేశం
నల్గొండ 11వ డివిజన్‌లో సోమవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వన్ టౌన్ CI ఏమీ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, SIలు లచ్చి రెడ్డి, లింగా రెడ్డి హాజరై ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. యువత నిబంధనలు పాటించి తమ ప్రాణాలు, ఇతరుల భద్రతను కాపాడాలని కోరారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు.