బాలికల వసతి గృహ విద్యార్థినిలకు వనభోజనం

బాలికల వసతి గృహ విద్యార్థినిలకు వనభోజనం

JGL: మెట్‌పల్లిలోని షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహ విద్యార్థినులకు ఆదివారం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే. రాజ్ కుమార్ ఆదేశాల మేరకు వసతి గృహ సంక్షేమ అధికారిణి శ్రీలత ఆధ్వర్యంలో పట్టణ శివారు పార్క్‌లో వన భోజనం ఏర్పాటు చేశారు. విద్యార్థినులు మ్యూజిక్ చైర్ వంటి ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.