భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

అనంతపురం: జేఎన్‌టీయూ కళాశాల ఎదురుగా ఆదివారం హత్యకు గురైన అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ మూర్తి రావు మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన భార్య శోభ గుండెపోటుతో మృతి చెందారు. ఈమె తాడిమర్రి మండలం పిన్నదరి ఉన్నత పాఠశాలలో బయాలజీ పాఠశాల సహాయకులుగా విధులు నిర్వహిస్తున్నారు.