కనువిందు చేస్తున్న కొడుముంజ 'మినీ బీచ్'
SRCL: జిల్లాలోని కొడుముంజ ప్రాంతం 'మినీ బీచ్'గా స్థానికంగా ప్రసిద్ధి చెందింది. చుట్టూ గుట్టలు, తాటి చెట్లు కనిపిస్తూ సహజమైన పచ్చటి గడ్డితో ఆహ్లదకరంగా కనిపిస్తోంది. వాగులో అలల తరహా నీటి ప్రవాహం ఉండటంతో బీచ్ అనుభూతి కలుగుతుంది. వీకెండ్స్‌లో స్నేహితులు ఇక్కడకు వచ్చి సమయాన్ని ఆస్వాదిస్తూ, ఇక్కడ లభించే కల్లు తాగుతూ ఆనందిస్తుంటారు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు తరచూ వస్తుంటారు.