కళాశాలలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

ATP: అనంతపురం కేఎస్ఎన్ కళాశాలలో తాగునీటి సమస్య ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు విద్యార్థులు విన్నవించుకున్నారు. ఒకే కొళాయి ద్వారా నీరు సరఫరా అవుతోందని ఎమ్మెల్యేకు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులతో పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమస్య పరిస్కరించినందుకు ఎమ్మెల్యేకు విద్యార్థినులు, అధ్యాపకులు కృతఙ్ఞతలు తెలిపారు.