కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

SRCL: ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. న్యాలం రమేష్ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.