మానవత్వం చాటుకున్న అనాజిపురం గ్రామ ప్రజలు
BHNG: అనాజీపురం గ్రామ ప్రజలు, యువత ముందుకు వచ్చి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నల్ల అంజయ్య కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న గ్రామస్తులు, యువకులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించారు. ఈ క్రమంలో మంగళవారం సేకరించిన రూ.53,500 నగదుతో పాటు, ఆ కుటుంబానికి తక్షణ అవసరాల నిమిత్తం 50 కేజీల బియ్యం బస్తాను అందజేశారు.