రెండు బస్సులు ఢీ.. తప్పిన పెను ప్రమాదం
అనంతపురం: రాయదుర్గం మండలం ఆవుల దట్ల కదరంపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఆర్టీసీ బస్సు-ప్రైవేట్ బస్సు గురువారం ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే సమయంలో వెనుక నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొన్నట్లు తెలిపారు. ఘటనలో పలువురి ప్రయాణికులతో పాటు అదే సమయంలో రోడ్డు పక్కన వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడుకి గాయాలయ్యాయి.