స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం సందర్శించారు. నెలవారీ తనిఖీలలో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గదిని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న భద్రత సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా అధికారులు, భద్రత సిబ్బంది ఉన్నారు