రేపు కామారెడ్డిలో కేసీఆర్ కార్నర్ మీటింగ్

రేపు కామారెడ్డిలో కేసీఆర్ కార్నర్ మీటింగ్

KMR: జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఆయన జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ విగ్రహం వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.