VIDEO: బ్రహ్మోత్సవాల్లో శేష వాహనంపై శ్రీవారు
SRD: నారాయణఖేడ్ మండలం సంజీవనరావుపేటలో శనివారం రాత్రి అనంత శయన పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్తీక శుద్ధ ప్రబోధిని ఏకాదశి పురస్కరించుకొని శ్రీ లక్ష్మి అనంతశయన స్వామి వారు శేష వాహనంపై ఊరేగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భాజా భజంత్రీల నడుమ శ్రీవారి శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.