ఘనంగా సినీ నటి అంజలీ దేవి వర్ధంతి వేడుకలు

కాకినాడ: ప్రముఖ సినీ నటి అంజలిదేవి 10వ వర్ధంతి వేడుకలను పెద్దాపురంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద ఉన్న విగ్రహనికి అంజలి దేవి ఫౌండేషన్ చైర్మన్, జనసేన పార్టీ పెద్దాపురం పట్టణ అధ్యక్షుడు పొలిమరశెట్టి సత్తిబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రండి సత్యనారాయణలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.