రైతు ఖాతా నుంచి రూ.27 వేలు స్వాహా

KMM: వాట్సప్‌కు వచ్చిన ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో రైతు బ్యాంకు ఖాతా నుంచి రూ.27,600 మాయమైన ఘటన రఘునాథపాలెం మండలంలో జరిగింది. కొర్రతండాకు చెందిన ఓ రైతుకు ఈనెల 12న వాట్సాప్‌కు వచ్చిన ఫైల్ ఓపెన్ చేశాడు. ఆ కాసేపటికి ఖాతా నుంచి రూ.27,600 విత్ డ్రా అయింది. దీంతో అప్రమత్తమైన రైతు 1930 నంబర్‌కు ఫోన్ చేశాడు. అనంతరం బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసారు.