43 ఏళ్లకు కలిశారు!

సిద్దిపేట్: పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై 43 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల ప్రభుత్వ పాఠశాలలో 1976-82 మధ్య చదువుకున్న విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తమ పాఠశాల రోజులను గుర్తు చేసుకుంటూ ఆనందించారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.