నిజాంపేటలో ప్రకృతి వైద్య శిబిరం
MDK: నిజాంపేట మండల కేంద్రంలో ఈనెల 11 నుంచి 16 వరకు రామాయంపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రకృతి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్ కోశాధికారి తిరుపతి గౌడ్, కార్యదర్శి స్వామి తెలిపారు. నిజాంపేట వైశ్య భవన్‌లో రాజస్థాన్ వైద్యులచే 100కు పైగా ఆరోగ్య సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.