ఆటో స్టాండ్‌కు అనుమతివ్వండి: ఆర్‌వీజే యూనియన్
సత్యసాయి: పుట్టపర్తిలోని ఆర్‌వీజే జంక్షన్ వద్ద ఆటోలు నిలిపే స్థలానికి పోలీసులు అనుమతించకపోవడంతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఆటో యూనియన్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి, సంబంధిత పోలీసు అధికారులకు వారంతా వినతిపత్రం సమర్పించారు. ఆటోలను నిలిపేందుకు అనుమతి కల్పించి, తమ కుటుంబాల జీవనాధారం కొనసాగేలా సహకరించాలని కోరారు.