అట్రాసిటీ కేసుపై విచారణ

SKLM: నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక భవానిపురం వీధి చెరువు గట్టు వద్ద నివాసముంటున్న దుంగ రుతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేశామని డీఎస్పీ మూర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇదే వీధికి చెందిన ఒకరు కులదూషణ చేశారని అంతే కాకుండా తమ బంధువులపై దాడి కూడా చేశారని ఫిర్యాదులో పేర్కొంది.