VIDEO: విశాఖలో సందడి చేసిన కాజల్ అగర్వాల్
విశాఖ ద్వారకానగర్‌లో గురువారం సందడి నెలకొంది. ప్రముఖ సినీనటి కాజల్ విచ్చేసి నూతనంగా ఏర్పాటు చేసిన ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జైలు థీమ్ సెట్టింగులు, వినూత్నమైన ఇంటీరియర్‌ను ఆమె ఆసక్తిగా పరిశీలించారు. ఆమెను చూడటానికి అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు.