రైల్వేస్టేషన్‌లో 14 కేజీల గంజాయి స్వాధీనం
ప్రకాశం: ఒంగోలు రైల్వే స్టేషన్‌లో పోలీసులు గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు మీదుగా వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో నిర్వహించిన తనిఖీలలో సుమారు 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.