ఐటీఐలో 6 షార్ట్ టర్మ్ కోర్సులు ప్రారంభం
PDPL: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 6 షార్ట్ టర్మ్ కోర్సులను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువత ఈ కోర్సులను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని ఎమ్మెల్యే సూచించారు.