సైబర్ నేరాలకు దూరంగా ఉండాలి: ఎస్సై

సైబర్ నేరాలకు దూరంగా ఉండాలి: ఎస్సై

KMR: ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని దోమకొండ ఎస్సై ప్రభాకర్ సూచించారు. సైబర్ నేరాల వల్ల ఎంతోమంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ఈ విషయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సమాజ నిర్మాణం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.