కార్తీకమాసం స్పెషల్: 365 ఒత్తుల విశిష్టత తెలుసా? 

కార్తీకమాసం స్పెషల్: 365 ఒత్తుల విశిష్టత తెలుసా? 

కార్తీకమాసం శివాలయంలో ఒక మట్టి ప్రమిదలో 365 ఒత్తులు వేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే సంవత్సరం మొత్తం శివాలయంలో దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. 365 ఒత్తులే ఎందుకు వెలిగిస్తారంటే సంవత్సరంలో ఉండే 365 రోజులకు 365 ఒత్తులు సంకేతం. కాబట్టి భక్తులు కార్తీకమాసంలో 365 ఒత్తులతో దీపారాధన చేస్తారని పండితులు చెబుతారు.