ఓపీటీపై సమీక్ష.. విదేశీ విద్యార్థులపై ప్రభావం!
అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగామ్‌ను సమీక్షించనున్నట్లు తెలిపింది. అమెరికా కార్మికుల ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా ఈ సమీక్ష చేపట్టింది. ఒక వేళ ఓపీటీపై కఠిన ఆంక్షలు విధిస్తే భారత్‌తో సహా పలు విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది.