నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NLG: మాడ్గులపల్లి సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా నేడు మాడ్గులపల్లిలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడనుంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది. ఈ మేరకు మండల విద్యుత్ శాఖ ఏఈ మణిదీప్ బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.