ముగ్గుతో సీఎం రేవంత్ చిత్రాన్ని గీసిన మహిళ
SRCL: గొల్లపల్లిలో ఓ కాంగ్రెస్ నాయకుడు తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గోగూరి అంజలి, శ్రీనివాస్ రెడ్డి దంపతులు తమ ఇంటి ముంగిట సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ముగ్గుతో తీర్చిదిద్దారు. రంగురంగుల రంగవల్లికలతో సీఎం బొమ్మను అందంగా రూపొందించారు. సీఎంపై తమకున్న అపారమైన అభిమానంతోనే ఈ విధంగా చేశామని అన్నారు.