'నూతన టెక్నాలజీతో ఫోటోగ్రాఫర్లు నిలదొక్కుకోవాలి'

NLG: నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ఫోటో, వీడియో గ్రాఫర్లు నిలదొక్కుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. నకిరేకల్ మండల ఫోటోగ్రాఫర్లను మంగళవారం ఆయన సన్మానించి, ప్రపంచ ఫోటోగ్రఫీ శుభాకాంక్షలు తెలిపారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. సంక్షేమ పథకాల వర్తింపులో ప్రాధాన్యత ఇస్తానన్నారు.