విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది: సీఎం

TG: విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అధికారులకు వెల్లడించారు. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నిర్మించే నీటి పారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు.