'జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

BHNG: వాతవరణ శాఖ హెచ్చరిక ప్రకారం రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని జిల్లాకు సంబంధించిన అధికారులను కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అత్యవసర విషయాల కోసం 08685293312. కి డయల్ చేయాలని సూచించారు.