'కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు'

'కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు'

JN: కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. పాలకుర్తిలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలతో ఝాన్సీరెడ్డి సమావేశమయ్యారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్తూ రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.