VIDEO: భారీగా పొగ మంచు.. వాహనదారుల ఇబ్బందులు
MBNR: బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం భారీ పొగమంచు కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా, NH 44పై పొగమంచు కారణంగా ముందున్న వాహనాలు కనబడకపోవడంతో డ్రైవర్లు లైట్లు వేసుకొని నెమ్మదిగా ప్రయాణించారు. పొలాలకు వెళ్లే రైతులు, కార్మికులు, పాఠశాల విద్యార్థులు పొగమంచు వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.