కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో గురువారం రాత్రి వైసీపీ ఇన్‌ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో నిర్వహిస్తున్న మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేటీకరణ వల్ల పేదలు విద్యా, వైద్యాన్ని కోల్పోతారని, దీనిని ప్రభుత్వం గుర్తించి మనసు మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.