VIDEO: పర్వతగిరి మండల కేంద్రంలో చోరీ

VIDEO: పర్వతగిరి మండల కేంద్రంలో చోరీ

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో చోరి జరిగింది. బాధితుడు నవీన్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం కుటుంబంతో బంధువుల ఇంటికి వెళ్లగా, నేడు (సోమవారం) ఉదయం తిరిగి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించామన్నారు. ఇంట్లోని వస్తువులను చిందరవందర చేసి, దాచి ఉంచిన రూ.14వేల నగదును అపహరించుకుపోయినట్లు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.