నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
ADB: జిల్లాలోని పలు స్కూల్‌లలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. KGBV ఆదిలాబాద్ రూరల్, అర్బన్, బేలా, మావల, తోషంలలో మొత్తం ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని DEO రాజేశ్వర్ తెలిపారు. బాలికల హాస్టల్ బంగారిగూడలో హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, వాచ్ ఉమెన్ పోస్టులు నాలుగు ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.