బీజేపీ అధ్యక్షునికి హోంగార్డుల వినతి

బీజేపీ అధ్యక్షునికి హోంగార్డుల వినతి

కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్‌ జంక్షన్‌లో మంగళవారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు టీవీఎన్‌ మాధవరావుకు హోంగార్డుల సంక్షేమ సంఘం ప్రతినిధి కరప దుర్గాప్రసాద్ వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కానిస్టేబుల్‌ నియామకాల్లో రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు.