VIDEO: జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
KNR: మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని కరీంనగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గంగుల స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.