ఇందిరా మహిళా శక్తి దుకాణాలను ప్రారంభించిన కలెక్టర్

SRCL: ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ఏర్పాటు చేసుకునే అవకాశం పొందిన మహిళలు వ్యాపారంలోనూ రాణించాలని, స్వయం సమృద్ధి సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గంభీరావుపేటలో శ్రీ మణికంఠ గ్రామ సమైక్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాలు దుకాణాన్ని కలెక్టర్ బుధవారం ప్రారంభించారు.