పార్కింగ్‌కు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి

పార్కింగ్‌కు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి

GDWL: సరకు రవాణాకు ఉపయోగించే లారీలు పార్కింగ్ చేసుకునేందుకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పచ్చర్ల శ్రీధర్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం లారీల యజమానులతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. సరకు రవాణా అనంతరం లారీలు నిలుపుకునేందుకు స్థలం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.