శిరస్త్రాణంపై అవగాహన ర్యాలీ
PPM: ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు విధిగా హెల్మెంట్ ధరించి, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం రక్షణ పొంది సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి వాహనదారులకు పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రజల్లో భద్రత అవగాహన కల్పించేందుకు హెల్మెంట్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.