'కుటుంబ నియంత్రణకు మగవారు బాధ్యత తీసుకోవాలి'
KMM: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో మగవారి భాగస్వామ్యం పెంచాలనే ఉద్దేశ్యంతో వాసెక్టమి ఆపరేషన్ చేస్తున్నట్లు కల్లూరు డివిజన్ Dy. DMHO ప్రదీప్ బాబు తెలిపారు. శుక్రవారం తెలగవరం సబ్ సెంటర్ నుంచి వచ్చిన వ్యక్తికి కల్లూరు CHC సర్జన్ డా. రమేష్ స్వామి వేసేక్టమి ఆపరేషన్ చేసి 2 గంటల్లో డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. కుటుంబ నియంత్రణకు మగవారు బాధ్యత తీసుకోవాలన్నారు.