VIDEO: రోడ్డుపై బీర్ బాటిల్తో మందుబాబు వీరంగం
అన్నమయ్య: ఆర్టీసీ బస్సు ముందు ఓ మందుబాబు వీరంగం సృష్టించిన ఘటన రాయచోటిలో చోటుచేసుకుంది. పట్టణంలోని బంగ్లా సర్కిల్ వద్ద నడిరోడ్డుపై బీర్ బాటిల్ పగలగొట్టి RTC బస్సులు, వాహనదారులను అడ్డుకుని హల్ చల్ చేశాడు. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని స్టేషన్కు తరలించారు.