రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GDWL: జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఓల్డ్ హౌసింగ్ బోర్డ్, రాధా కృష్ణ కాలనీ, 2వ రైల్వే గేట్ ఏరియా, సంతోష్ నగర్, వేణు కాలనీ, బీరెల్లి రోడ్ తదితర ప్రాంతాల్లో ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు పేర్కొన్నారు.