'సోనియాగాంధీకి ప్రజలు రుణపడి ఉండాలి'

BHNG: ఆలేరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి పాల్గొన్నారు.