VIDEO: తెనాలిని కమ్మేసిన మంచు దుప్పటి
GNTR: వేసవి ముంగిట తెనాలి పట్టణాన్ని సోమవారం ఉదయం పొగమంచు కప్పేసింది. తెల్లవారుజామున 5 గంటల నుంచే భారీగా మంచు కురవడంతో తెనాలిని మంచు దుప్పటి కప్పుకున్నట్లు కనిపించింది. మార్చి నెలలో కూడా ఇంతటి దట్టమైన పొగమంచు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 6 దాటినా రహదారులు సరిగ్గా కనిపించక లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది.