మహిళలకు డబుల్ ఛార్జీ వసూల్!

మహిళలకు డబుల్ ఛార్జీ వసూల్!

KMM: భద్రాచలం నుంచి వైరాకు KTDM డిపో ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఉచిత ప్రయాణ అవకాశం ఉన్నప్పటికీ, గురువారం రాత్రి కండక్టర్ నిబంధనలకు విరుద్ధంగా మహిళలకు రూ. 260 డబుల్ ఛార్జీ వసూలు చేశారు. అసలు ఛార్జీ రూ. 130 ఉండగా, పథకం వర్తించే వారి నుంచి డబ్బులు తీసుకోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.